English | Telugu

'టైగర్ కెసిఆర్'... టార్గెట్ చంద్రబాబు!

on Apr 20, 2019

 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మకు ఎందుకంత కోపమో? వరుస సినిమాలతో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఇక ట్విట్టర్ సంగతి చెప్పనక్కర్లేదు. సినిమాల విషయానికి వస్తే... 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో చంద్రబాబును నెగిటివ్ షేడ్‌లో చూపించారు వర్మ. అందులో 'వెన్నుపోటు' పాటతో చంద్రబాబుకు ఎంత చేటు చేయాలో అంతా చేశారు. మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బ‌యోపిక్‌లోనూ ఆయన్ను టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కెసిఆర్ బయోపిక్ 'టైగర్ కెసిఆర్' ఫస్ట్ లుక్ విడుదల చేస్తానన్న వర్మ, సినిమా లుక్ విడుదల చేయలేదు. "మా భాష మీద న‌వ్విన‌వ్‌. మా ముఖాల మీద ఊసిన‌వ్‌. మా బాడీల మీద న‌డిచిన‌వ్ ఆంధ్రోడా. వ‌స్తున్నా... వ‌స్తున్నా... మీ తాట తీయ‌డానికి వస్తున్నా. టైగర్ కెసిఆర్... కమింగ్ సూన్" అని వర్మ ఒక వీడియో విడుదల చేశారు.

"తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు/విభజన తరవాత ప్రశాంతంగా కలిసి మెలిసి జీవిస్తున్న తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న రామ్ గోపాల్ వర్మ" అని నెటిజన్లు కామెంట్ చేశారు. వాటిపై వర్మ స్పందించారు. "నా సినిమాలో ఆంధ్ర‌వాళ్ళ‌ను విల‌న్లుగా చూపించ‌డం లేదు. విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన ప‌రిస్థితుల‌ను క‌ల్పించి కోట్లాది మంది ఆంధ్రోళ్ళ‌కు వెన్నుపోటు పొడిచిన కొంద‌రు ఆంధ్ర‌వాళ్ళ‌ను విల‌న్లుగా చూపిస్తున్నా" అని వర్మ పేర్కొన్నారు. అంతే కాదు "బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడి పీస్ ఫుల్ గాంధీ ఇండియా ఎలా సాధించారో... ఆంధ్రులపై అగ్రెస్సివ్ గాంధీ పోరాడి తెలంగాణ సాధించారు" అని ట్వీట్ చేశారు. దాంతో వర్మపై తెలుగుదేశం, చంద్రబాబు అభిమానులు మండిపడుతున్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here