సిజ్జు, డైరెక్టర్ రాజేశ్ టచ్రివర్ సహా 14 మందిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు..
on Jun 18, 2021
మలయాళం నటి రేవతి సంపత్ సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 14 మందిపై ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. పైగా వారి పేర్లను ధైర్యంగా వెల్లడించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వారి పేర్లను ఆమె బయటపెట్టడం ఇప్పుడు మలయాళం చిత్రసీమను కుదిపేస్తోంది. ఆమె వెల్లడించిన పేర్లలో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడైన నటుడు సిజ్జు, 'బంగారు తల్లి' సహా పలు అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్ తీసిన రాజేశ్ టచ్రివర్ కూడా ఉండటం అందరినీ షాక్కు గురిచేస్తోంది. అంతేకాదు, మలయాళంలో పేరుపొందిన సీనియర్ నటుడు సిద్దిఖ్ కూడా ఆ లిస్టులో ఉన్నాడు.
ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందనీ, సినిమాల్లో పనిచేసే స్త్రీలకు ఈ కష్టాలు తప్పవనీ రేవతి చెప్పారు. అయినప్పటికీ తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆమె బయటపెట్టిన పేర్లలో ఒక పాపులర్ ఫొటోగ్రాఫర్, సబ్ ఇన్స్పెక్టర్, క్యాస్టింగ్ డైరెక్టర్, ఒక డాక్టర్, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ కూడా ఉన్నారు.
రాజేశ్ టచ్రివర్ డైరెక్టర్ చేసిన 'పాట్నాఘట్' మూవీతో పరిచయమైన రేవతి తనను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తులంటూ బయటపెట్టిన జాబితా ఇదే.. 1. రాజేశ్ టచ్రివర్ (డైరెక్టర్), 2. సిద్దిఖ్ (యాక్టర్), 3. ఆషికీ మహి (ఫొటోగ్రాఫర్), 4. సిజ్జు (యాక్టర్), 5. అభిల్ దేవ్ (కేరళ ఫ్యాషన్ లీగ్ ఫౌండర్), 6. అజయ్ ప్రభాకర్ (డాక్టర్), 7. ఎమ్మెస్ పదూష్, 8. సౌరభ్ కృష్ణన్ (సైబర్ బల్లీ), 9. నందు అశోకన్, 10. మాక్స్వెల్ జోస్ (షార్ట్ఫిల్మ్ డైరెక్టర్), 11. షానుబ్ కరావత్ (యాడ్ డైరెక్టర్), 12. రాగేంద్ పై (క్యాస్టింగ్ డైరెక్టర్), 13. సరూన్ లియో, 14. బిను (సబ్ ఇన్స్పెక్టర్).
Also Read