పవన్-రేణు కుమార్తె పేరే వెబ్ సిరీస్ టైటిల్?
on Sep 23, 2020
పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ విడాకులు తీసుకున్నారు. అయితే, వాళ్లిద్దరి వైవాహిక జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కలిగారు. అబ్బాయి అకిరా నందన్, అమ్మాయి ఆద్య. ఇప్పుడు ఆ అమ్మాయి పేరే నటిగా రేణూ దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్‌కి టైటిల్‌గా కన్ఫర్మ్ చేశారట.
ఇటీవల తానొక వెబ్ సిరీస్ చేస్తున్నట్టు రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎంఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహించనున్న ఆ సిరీస్‌ను సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డీఎస్ రావ్, రజనీకాంత్ ఎస్. నిర్మించనున్నారు. సుమారు 17 ఏళ్ళ విరామం తరవాత ఈ సిరీస్ కోసం మళ్ళీ రేణూ దేశాయ్ కెమెరా ముందుకు వస్తున్నారు. అక్టోబర్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సిరీస్ కి 'ఆద్య' టైటిల్ ఖరారు చేశారని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
నటిగా రేణు దేశాయ్ రీ ఎంట్రీ చిత్రానికి ఆమె కుమార్తె పేరు టైటిల్ పెట్టడం ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఈ పేరు ఎందుకు పెట్టారు అనేదానిపై రేణుదేశాయ్ ఏం చెబుతారో చూడాలి.
Also Read