వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా.. ఆశీర్వదించండి.. అర్థించిన రేణు దేశాయ్!
on Sep 20, 2020
చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ కెమెరా ముందుకు వస్తున్నారు. ఓ అందమైన వెబ్ సిరీస్‌లో నటించడానికి సంతకం చేశాననీ, వచ్చే నెలలో షూటింగ్ మొదలు పెడతామనీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె తెలియజేశారు. అందులో నటించనున్నందుకు సూపర్ హ్యాపీగా, ఎగ్జయిటింగ్‌గా ఉందని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో మేకప్‌తో బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న తన బ్యూటిఫుల్ పిక్చర్‌ను ఆమె షేర్ చేశారు. అది ఫొటోషూట్‌లో తీసిన పిక్చర్ అని అర్థమవుతోంది.
"కొద్ది రోజుల్లో మరిన్ని వివరాలను పోస్ట్ చేస్తాను. నిజం కోసం అన్వేషించే ఒక దృఢనిశ్చయం కలిగిన స్త్రీ జర్నీ కథ ఈ వెబ్ సిరీస్ ఇతివృత్తం. ఈ జర్నీలో మీరు నాతో కలిసి, మీ ఆశీర్వాదాలు, ప్రేమ అందించాల్సిందిగా కోరుతున్నాను." అని ఆమె రాసుకొచ్చారు. సినీ నిర్మాత-నటుడు డి.ఎస్. రావు, రజినీకాంత్ ఎస్. సంయుక్తంగా నిర్మించే ఈ సిరీస్‌కు ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ దాసరి శివేంద్ర వర్క్ చేస్తుండటం ఈ సిరీస్‌కు మరింత ఆకర్షణను తీసుకు రానున్నది.
Also Read