రవితేజ ప్లాన్ చేంజ్... హైదరాబాద్ వర్షాలే కారణం!
on Oct 14, 2020
భారీ వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో పలువురు ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమయం కావడంతో అక్కడి ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజల మీదే కాదు... సినిమాలపై కూడా వర్షం ప్రభావం చూపించింది.
మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'క్రాక్'. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇటీవల చిత్రీకరణ ప్రారంభించారు. హైదరాబాద్ భారీ వర్షాల కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్లాన్ మారింది. అవుట్ డోర్ లొకేషన్లలో చిత్రీకరించాలని అనుకున్న సన్నివేశాలను ఇండోర్ సెట్లు, లొకేషన్ కి చేంజ్ చేశారు. దీనికి వర్షాలే కారణం. సన్నివేశాలకు అవసరమైన సెట్లను ఇండోర్ లో వేస్తున్నారు. విదేశాలలో తీయాలన్న పాటలను కూడా స్టూడియోలలో తీస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.