మారుతి డైరెక్షన్‌లో మాస్ మహారాజా
on Nov 24, 2020
గతేడాది 'ప్రతిరోజు పండగే' చిత్రంతో భారీ విజయాన్ని అందించినప్పటికీ, దర్శకుడు మారుతి తన తదుపరి చిత్రానికి ఏ స్టార్‌ను ఒప్పించలేకపోయాడు. దాదాపు ఒక సంవత్సరం పాటు, అనేక మంది స్టార్స్ చుట్టూ చక్కర్లు కొట్టిన తరువాత, వరుసగా నాలుగు ఫ్లాప్‌లను చవిచూసి, మళ్లీ తనేమిటో చూపించాలని ఎదురుచూస్తున్న రవితేజతో కలిసి పనిచేయాలని అతను నిర్ణయించుకున్నాడు. ఈ మూవీని యు.వి. క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది.
రవితేజ ఇటీవలే 'క్రాక్' మూవీని పూర్తిచేసి, ప్రస్తుతం రమేశ్‌వర్మ డైరెక్ట్ చేస్తున్న మూవీని చేస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఆ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ఏక కాలంలో నటించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన 'రాజా ది గ్రేట్' మూవీ రవితేజ చివరి హిట్ ఫిల్మ్. దాని తర్వాత వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా చిత్రాలతో ఫ్లాపులు చవిచూశాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో చేసిన 'క్రాక్' సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తానని ఆయన నమ్ముతున్నాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
