రవితేజ సినిమాలో... లేడీ చిట్టిబాబు '2.ఓ'!
on Dec 18, 2018
రోబో.. ఫస్ట్ వెర్షన్. '2.ఓ'.. రోబోకి అడ్వాన్స్డ్ వెర్షన్. 'రంగస్థలం'లో రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు క్యారెక్టర్ ఫస్ట్ వెర్షన్ అయితే... రవితేజ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చేయబోయే క్యారెక్టర్ చిట్టిబాబుకు అడ్వాన్స్డ్ వెర్షన్ అట. అంటే... లేడీ చిట్టిబాబు '2.ఓ' అన్నమాట! రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఓ హీరోయిన్. గతంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీసిన విఐ ఆనంద్... రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో పాయల్ క్యారెక్టర్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారట.
ఒక్క ముక్కలో ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే... అమ్మాయికి సరిగా కనపడదు, సరిగా వినపడదు. చూపు మందగించడంతో పాటు వినికిడి సమస్య ఉన్న అమ్మాయి పాత్రలో పాయల్ రాజ్‌పుత్ కనిపిస్తారు. 'రంగస్థలం'లో చిట్టిబాబు సమస్య ఏంటి? అతడికి వినికిడి లోపం. రవితేజ సినిమాలో హీరోయిన్‌కి వినికిడి లోపంతో పాటు చూపు సమస్య కూడా ఉంది. చిట్టిబాబు సౌండ్ ఇంజినీర్ అయితే... రవితేజ సినిమాలో హీరోయిన్ సౌండ్ ప్లస్ లుక్ ఇంజినీర్. మొదటి సినిమా 'ఆర్.ఎక్స్ 100'లో నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేసిన పాయల్ రాజ్‌పుత్ మరో ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మాట!