రవితేజ క్యారెక్టర్లో రెండు షేడ్స్?
on Jul 8, 2020
రవితేజ డ్యూయల్ రోల్, డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ గతంలో చేశాడు. అయితే, డ్యూయల్ షేడ్స్ ఉన్న ఒక కొత్త క్యారెక్టరైజేషన్‌తో మాస్ మహారాజ్‌ను దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ ఇంప్రెస్ చేశారని ఇన్సైడ్ వర్గాల టాక్.
రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. లవ్, ఫ్రెండ్ షిప్, రొమాన్స్, రివేంజ్, కామెడీ మేళవింపుతో 1980 నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉంటుందని సమాచారం. ఇందులో రవితేజ డ్యూయల్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడట. అందులో ఓ షేడ్ బిజినెస్‌మేన్‌గా ఉంటుందని తెలిసింది. స్క్రీన్ మీద రవితేజ బిజినెస్‌మేన్‌గా కనిపించినంత సేపూ ఫుల్ ఫన్ ఉంటుందట. కామెడీతో పాటు కిర్రాక్ ఎమోషన్స్ కూడా సినిమాలో ఉన్నాయట.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'క్రాక్' కంప్లీట్ అయిన తరవాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందట. దీని తరవాత మలయాళ రీమేక్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' స్టార్ట్ అవుతుందని టాక్.