రవితేజకు అంత ఇవ్వడానికి ఓకే అన్నారా?
on Sep 16, 2020
మాస్ మహారాజ్ రవితేజ రెమ్యూనరేషన్ 10 నుండి 12 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందని వినికిడి. అయితే మొన్నా మధ్య వరుస ఫ్లాపులు రావడంతో అతడికి అంత ఇవ్వడానికి నిర్మాతలు వెనకడుగు వేశారని గుసగుసలు సైతం ఫిలింనగర్లో వినిపించాయి.
కరోనా నేపథ్యంలో థియేటర్ లో తెరుచుకున్న తర్వాత ఇంతకుముందులా ప్రేక్షకులు వస్తారా? ఇంతకుముందు వచ్చినట్లు సినిమాలక భారీ వసూళ్లు వస్తాయా? అని పలు సందేహాలు నిర్మాతల మదిలో మెదులుతున్నాయి. హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటే మంచిదని తమిళ ఇండస్ట్రీలో నిర్మాతలు సూచిస్తున్నారు. ఇటువంటి సమయంలో రవితేజకు యువి క్రియేషన్స్ 15 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిందట.
రవితేజ హీరోగా మారుతి ఒక కామెడీ ఎంటర్టైనర్ తీయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని యువి క్రియేషన్స్ నిర్మించనుందట. మారుతి దర్శకత్వం వహించిన 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' చిత్రాలను యువి నిర్మించింది. దర్శకుడి పై నమ్మకంతో రవితేజకు భారీ ఆఫర్ ఇచ్చిందని టాక్. 'క్రాక్' తర్వాత మారుతి సినిమా చేయడానికి రవితేజ ఆసక్తిగా ఉన్నారట. ఆ తర్వాతే రమేష్ వర్మ, త్రినాధరావు నక్కిన సినిమాలు చేస్తారట.