జిమ్‌లో కండలు పెంచుతున్న మాస్ మహారాజా!
on Nov 30, 2020
వయసుతో నిమిత్తం లేకుండా యంగ్, సీనియర్ హీరోలంతా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇవాళ ఫిట్‌నెస్‌కూ, ఫిజిక్కూ చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఒకట్రెండు నెలల నుంచీ టాలీవుడ్లో షూటింగ్‌లు పునరుద్ధరింపబడంతో వారంతా ఒకవైపు షూటింగ్‌లతో, మరోవైపు వర్కవుట్స్‌తో యమ బిజీగా మారిపోయారు. మాస్ మహారాజా రవితేజ సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఫిట్‌గా ఉండటం కోసం ఆయన క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తూ వస్తున్నాడు.
కండల్ని పెంపొందింపజేసే, శరీరానికి దృఢత్వం కలగజేసే వర్కవుట్స్ చేస్తున్న ఓ చిన్న వీడియోను సోమవారం తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆయన షేర్ చేశాడు. అందులో ఆయన డిఫరెంట్ వర్కవుట్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోకు "స్వెట్. స్మైల్. రిపీట్" అనే క్యాప్షన్ జోడించాడు. ఫిట్నెస్ కోసం తానెంత శ్రమిస్తాడో తెలియజేసే, తన బాడీని కరెక్ట్ షేప్‌లో ఉంచే, తనను ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలకు సంబంధించి 52 సంవత్సరాల రవితేజ రెగ్యులర్‌గా పిక్చర్స్, వీడియోస్ షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్నిస్తున్నాడు. ఇదివరకు జిమ్‌లో ఓ సెల్ఫీని షేర్ చేసి, "వేకప్, వర్కవుట్" అనే క్యాప్షన్ పెట్టాడు.
ప్రస్తుతం రవితేజ 'క్రాక్' సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఆయన ఒంగోలుకు చెందిన ఓ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. లేటెస్ట్గా రవితేజ, శ్రుతి హాసన్‌పై రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. సంక్రాంతికి 'క్రాక్'ను రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు రమేశ్ వర్మ డైరెక్షన్లో 'ఖిలాడీ' మూవీ చేస్తున్నాడు రవితేజ. కాగా మారుతి డైరెక్షన్లో ఓ సినిమాని చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇంతకుముందు ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఆ మూవీ నుంచి ఆయన తప్పుకున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
Also Read