డిస్కో రాజా... భారీ బడ్జెట్టే!
on Nov 30, 2018
'టచ్ చేసి చూడు', 'నెల టికెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ'... మాస్ మహారాజ రవితేజ నటించిన లాస్ట్ మూడు సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటించనున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా బడ్జెట్ తగ్గించాలని నిర్మాత రామ్ తాళ్ళూరి భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిని ఆయన ఖండించారు. 'నెల టికెట్'ను నిర్మించిందీయనే. ముందుగా అనుకున్నట్టు భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కిస్తామని రామ్ తాళ్ళూరి పేర్కొన్నారు. డిసెంబర్ 13 లేదా 14వ తేదీల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. నభా నటేష్, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమాలో బాబీ సింహా విలన్. సునీల్ కమెడియన్ క్యారెక్టర్ చేయనున్నాడు. 1980ల నేపథ్యంలో ఈ సినిమా కథ జరుగుతుందని టాక్.