English | Telugu

నైస్ వోడ్కా... అది రవితేజ డైలాగే!

on Jan 22, 2020

'డిస్కో రాజా'లో 'ఫ్రీక్ అవుట్' వీడియో సాంగ్ చూశారా? ప్రెసెంట్ యూట్యూబ్ లో టాప్ 3లో ట్రెండ్ అవుతోంది. అందులో రవితేజ ఒక డైలాగ్ చెప్తాడు‌... 'నైస్ వోడ్కా' అని! దర్శకుడు విఐ ఆనంద్ సీన్ రాసినప్పుడు ఆ డైలాగ్ లేదు. షూటింగ్ చేసే ముందు కూడా సీన్ లో ఆయన రాయలేదు. మరి, ఎలా వచ్చింది? అంటే... అది రవితేజ చెప్పిన డైలాగ్. అదొక్కటే కాదు... సినిమాలో చాలా వన్ లైనర్ డైలాగులను రవితేజ షూటింగ్ చేసేటప్పుడు చెప్పాడని దర్శకుడు విఐ ఆనంద్ స్వయంగా తెలిపాడు. ఈ నెల 24న సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో దర్శకుడు విఐ ఆనంద్ ముచ్చటించారు. 

"రవితేజ గారు గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. మామూలుగా గ్యాంగ్ స్టర్స్ అంటే చాలా సీరియస్ గా ఉంటారు. మా గ్యాంగ్ స్టర్ కి మాత్రం డిస్కో మ్యూజిక్ చాలా ఇష్టం. అతడి పేరు రాజ్. అందుకని అందరూ అతన్ని డిస్కోరాజా అంటారు. ఈ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. రవితేజ గారు చాలా బాగా చేశారు. యాక్టింగ్ చేసేటప్పుడు స్పాంటేనియస్ గా పంచ్ డైలాగులు చెప్పేవారు. ఉదాహరణకు..‌. ఫ్రీక్ అవుట్ సాంగ్ లో నైస్ వోడ్కా డైలాగ్. సినిమాలో 60, 70% వన్ లైనర్ డైలాగులను ఆయన అలా స్పాంటేనియస్ గా చెప్పినవే" అని విఐ ఆనంద్ అన్నారు. హీరోయిన్లు నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ కథలు ప్రాముఖ్యం గల పాత్రలు చేశారని ఆయన తెలిపారు.

 


Cinema GalleriesLatest News


Video-Gossips