రవితేజ 67వ చిత్రం ముహూర్తం రేపే!
on Oct 17, 2020
మాస్ మహారాజా రవితేజ, 'రాక్షసుడు' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన డైరెక్టర్ రమేశ్ వర్మ కాంబినేషన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత సత్యనారాయణ కోనేరు సిద్ధమవుతున్నారు. ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
'ఆర్టి67' (రవితేజ 67వ చిత్రం) ప్రి లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్నట్లున్న రవితేజ షాడో ఇమేజ్ను మనం చూడొచ్చు. ఈ హవీష్ ప్రొడక్షన్ మూవీ ముహూర్తం వేడుక ఆదివారం జరగనున్నది. అదేరోజు ఉదయం 11:55 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.
రవితేజ సరసన మీనాక్షి చౌధరి నాయికగా నటించే ఈ చిత్రంలో డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్గా ఎంపికయ్యింది. రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్లో ఇది రెండో సినిమా. ఇదివరకు ఆ ఇద్దరూ వీర చిత్రానికి కలిసి పనిచేశారు. అయితే అది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. అయినప్పటికీ ఇప్పుడు రమేశ్ వర్మ చెప్పిన స్క్రిప్ట్‌కు రవితేజ ఇంప్రెస్ అయ్యాడు. పైగా రాక్షసుడు మూవీని అతను తెరకెక్కించిన తీరు కూడా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Also Read