English | Telugu

రష్మిక ప్రేమ పెళ్లి పీటలు ఎక్కుతుందా...?

on Sep 10, 2018

నిప్పు లేనిదే పొగ రాదని ఓ సామెత. పొగ వచ్చినప్పుడు నిప్పు లేదని క్లారిటీ ఇచ్చినా మళ్ళీ మళ్ళీ పొగ వస్తుందంటే... బయటకు చెప్పకూడనిది ఏదో జరుగుతుందని జనాలు భావించే ప్రమాదం పొంచి వుంది. అసలు వివరాల్లోకి వెళితే... రష్మికకు కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ఎప్పుడో నిశ్చితార్థపు ఉంగరం తొడిగాడు. 'ఛలో'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడానికి ముందే అతడితో రష్మిక ప్రేమలో పడింది. తరవాత పెద్దలను ఒప్పించి పెళ్ళికి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఇద్దరూ సినిమాలతో బిజీగా వుండటంతో కొన్నాళ్ల తరవాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈలోపు రష్మిక తెలుగు తెరకు పరిచయం కావడం, ఇక్కడ బోల్డంత స్టార్‌డ‌మ్‌ సంపాదించుకోవడం జరిగాయి. అదే సమయంలో రక్షిత్ శెట్టితో ఆమెకు చెడిందని వార్తలొచ్చాయి. సదరు వార్తలను రష్మిక ఖండించారనుకొండి. కాని ఆగలేదు. మళ్ళీ మళ్ళీ రక్షిత్ శెట్టితో ప్రేమకథకు రష్మిక ఫుల్ స్టాప్ పెట్టిందని, అతడికి బ్రేక్ అప్ చెప్పేసిందని వార్తలు వస్తున్నాయి. ఇన్నిసార్లు పొగ వస్తుందంటే ఇద్దరి మధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌ ఏదో జరుగుతుందని ఇండస్ట్రీలో వ్యక్తులు అనుకుంటున్నారు. ఈసారి రష్మిక క్లారిటీ ఇస్తే చాలదు. ఒకవేళ ఇద్దరి మధ్య ఏం లేనిపక్షంలో రష్మికకు కాబోయే భర్త రక్షిత్ శెట్టి వివరణ ఇస్తే ప్రేక్షకులు నమ్ముతారు. రక్షిత్ క్లారిటీ ఇస్తే తప్ప ఈ వార్తలు ఆగవు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here