ENGLISH | TELUGU  

లవ్వు... బ్రేకప్పు... బాధలు భరిస్తూ!

on Sep 18, 2018

"కన్నడ హీరో రక్షిత్ శెట్టి, తెలుగులో 'ఛలో', 'గీత గోవిందం' చిత్రాల్లో నటించిన కథానాయిక, కన్నడ భామ రష్మిక మందన్న ప్రేమికులు" - ఇది ఒకప్పటి మాట!

"రక్షిత్ శెట్టి, రష్మిక నిశ్చితార్థం జరిగింది. రెండేళ్ల తరవాత పెళ్లి చేసుకుంటార్ట‌. లేదు లేదు... రష్మిక నాలుగేళ్ల తరవాత పెళ్లి చేసుకుంటానంటోంది" - ఇదీ ఒకప్పటి మాటే!

"రక్షిత్, రష్మిక మధ్య మనస్పర్థలు వచ్చాయని, త్వరలో బ్రేకప్ చెప్పేసుకుంటారని వార్తలు వస్తే... రష్మిక ఖండించారు" - ఆఖరికి ఇదీ ఒకప్పటి మాటే! రష్మిక ఖండనలో నిజం లేదని తెలియడానికి, వాళ్లిద్దరూ విడిపోయారనేది నిజమని ప్రేక్షకులకు తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. మరి, ఇప్పటి మాట ఏంటి? "రక్షిత్ శెట్టితో ప్రేమ ప్రయాణానికి, నిశ్చితార్థానికి ముగింపు పలకడంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ రష్మికను పక్కన పెడుతోందట. గతంలో అంగీకరించిన కన్నడ సినిమా 'వ్రిత్రా' నుంచి ఆమెను పక్కకు తప్పించారట. దాంతో ఆమె సినిమా నుంచి తప్పుకున్నానని ప్రకటించిందట" - ఇదీ తాజా తాజా మాట! సదరు వార్తలపై రష్మిక స్పందించారు.
రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకున్న తరవాత ఓ కన్నడ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నారు. ఆ సినిమా దర్శకుడు రక్షిత్ స్నేహితుడు కావడంతో ఆమెను తప్పించారని వార్తలొచ్చాయి. సదరు వార్తల్లో నిజం లేదని రష్మిక తెలిపారు. "సారీ... చాలా రోజుల నుంచి సైలెంట్‌గా వున్నా. కాని నా గురించి వచ్చిన కథలు, కామెంట్స్, ట్రోల్స్... అన్నీ గమనిస్తున్నా. అవి చూసి డిస్ట్రబ్ అయ్యాను. మీరు నమ్మినవి రాశారు. అందుకని, నేను ఎవర్నీ బ్లేమ్ చేయడం లేదు. ఎవరికీ సమాధానం చెప్పాలని అనుకోవడం లేదు. నాణేనికి రెండు వైపుల ఉన్నట్టు... ప్రతి కథకి రెండు కోణాలు వుంటాయి. ఎవరికీ ఇటువంటి పరిస్థితి రాకూడదు. దయచేసి  ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి. నేను కన్నడ సినిమాల్లో నటిస్తూ వుంటాను. ఏ భాషలో నటించినా నా బెస్ట్ ఇస్తాను" అని రష్మిక ఒక ట్వీట్ చేశారు. నిశ్చితార్థం రద్దు అయితే ఎవరికైనా బాధగా ఉంటుంది. ఆ బాధ నుంచి తేరుకోక ముందు ఇటువంటి వార్తలు వస్తే బాధ ఎక్కువ అవుతుంది. ఈ బాధలను భరిస్తూ ప్రేక్షకులకు స్పష్టత ఇచ్చారు రష్మిక. ఈమె నటించిన కొత్త తెలుగు సినిమా 'దేవదాస్' ఈ నెల 27న విడుదల కానుంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.