విజయ్ దేవరకొండ ఇంటికెళ్లిన రష్మిక... ఎందుకంటే?
on Sep 25, 2020
విజయ్ దేవరకొండ తల్లి మాధవి హాఫ్ సెంచరీ కొట్టారు. ఆమె క్రికెట్ ఆడలేదులెండి. హాఫ్ సెంచరీ కొట్టింది వయసులో! నిన్న (గురువారం) మాధవి పుట్టినరోజు. పైగా 50వ పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యుల మధ్య స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు విజయ్ దేవరకొండ. ఆ పార్టీకి హీరోయిన్ రష్మిక వెళ్లారు.
రెండు సినిమాలలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు. 'గీత గోవిందం' భారీ విజయం సాధించగా... 'డియర్ కామ్రేడ్' మంచి పేరు తెచ్చుకుంది. రెండు సినిమాల్లోనూ ఇద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ... ప్రేమలో పడ్డారంటూ పుకార్లు వచ్చాయి. తాము మంచి స్నేహితులం మాత్రమేనని, తాను ఎవరినీ ప్రేమించడం లేదని రష్మిక పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు కూడా చేశారు. అదే వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ... ఆఫ్ స్క్రీన్ రిలేషన్షిప్ చూసిన చాలామంది మాత్రం ఆమె మాటలు నమ్మశక్యంగా లేవని కామెంట్లు చేస్తున్నారు.
ఫ్యామిలీ పార్టీకి సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇతరులను ఆహ్వానించకుండా... కేవలం రష్మికను మాత్రమే విజయ్ దేవరకొండ ఆహ్వానించడం వెనక ఏదో ఉందనుకుంటున్నారు జనాలు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకారు మరోసారి మొదలవుతుంది ఏమో!?
Also Read