చరణ్, సమంత చేసిన 'ముద్దుల' మోసం
on Apr 10, 2018
రంగస్థలంలో కనిపించిన చాలా చాలా షాకింగ్ అంశాల్లో ముద్దు సీన్ ఒకటి. ఓ సన్నివేశంలో రామ్‌చరణ్‌ని సమంత పెదాల మీద ఇంగ్లిషు ముద్దు పెట్టేసుకుంది. ఆ వెంటనే చరణ్ కూడా ఓ ఘాటు ముద్దిచ్చి బాకీ తీర్చేసుకున్నాడు. పెళ్లయ్యాక కూడా లిప్ లాక్ సన్నివేశానికి సమంత ఎలా ఒప్పుకుందబ్బా? నాగచైతన్య ఏమీ అనుకోడా? అక్కినేని ఫ్యాన్స్ ఫీలవ్వరా? అంటూ తెగ ఇదైపోయారంతా. కానీ ఇప్పుడు వాటికి సమంత సమాధానాలు ఇచ్చేసింది. ఇదేం నిజం ముద్దు కాదట. ఇది కెమెరా ట్రిక్ అట. చరణ్ బుగ్గపై ముద్దు పెడితే... అది కెమెరా ట్రిక్‌తో లిప్ లాక్ అనిపించేలా తీర్చిదిద్దారని ఆ లిప్ లాక్ సీక్రెట్ చెప్పేసింది సమంత. అయితే.. లిప్ లాక్‌లు పెట్టుకుంటే తప్పేంటి? అని వాదిస్తోంది. పెళ్లయిన హీరోయిన్లను లిప్ లాక్‌ల గురించి అడిగినట్టు, పెళ్లయిన హీరోల దగ్గర లిప్‌లాక్‌ల ప్రస్తావన తీసుకురారేంటి? అంటూ లాజిక్ తీసింది సమంత. అంటే.. ఇక మీదట నిజం ముద్దులు పెట్టుకోవాల్సివచ్చినా... సమంతకు అభ్యంతరాలు ఏమీ లేవన్నమాట. దర్శకులూ.. ఇలాంటి సన్నివేశాలు రాసుకోండి మరి!!
Also Read