చిరు రికార్డు గోవిందా!
on Apr 2, 2018
టాలీవుడ్లో రికార్డుల గురించి మాట్లాడితే.. ముందుగా గుర్తొచ్చేది బాహుబలి సినిమానే. ఆ రికార్డుల్ని ఎవ్వరూ బద్దలు కొట్టలేరు కాబట్టి - నాన్ బాహుబలి రికార్డ్ అంటూ ఒకటి మొదలైంది. నాన్ బాహుబలి రికార్డ్‌గా ముందుగా ఘనత వహించింది.. శ్రీమంతుడు చిత్రమే. అయితే.. చిరంజీవి ఖైది నెం.150.. మహేష్రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. దాదాపు 150 కోట్లతో బాహుబలి తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం ఆ రికార్డుని తిరగరాసే దిశగా అడుగులు వేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది రంగస్థలం. ఇప్పటికీ టికెట్లు దొరడం లేదు. దానికి తోడు వేసవి సీజన్. అందుకే.. అతి త్వరలో రంగస్థలం రూ.150 కోట్ల మార్క్‌నీ దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. రంగస్థలం టోటల్ రన్ దాదాపు 200 కోట్ల వరకూ ఉండొచ్చన్నది అంచనా. సో.. ఇప్పటి వరకూ నాన్ బాహుబలి రికార్డ్‌గా చెప్పుకుంటున్న ఖైది నెం.150 మూడో స్థానానికి పడిపోతోందన్నమాట. చిరు రికార్డుని మరొకరెవరైనా బద్దలు కొడితే మెగా ఫ్యాన్స్ ఫీలవుతారేమో గానీ చరణ్ అందుకుంటే హ్యాపీయేగా.