English | Telugu

రంగ‌స్థ‌లం తిప్ప‌లు అన్నీ.. ఇన్నీ కావ‌యా...!

on Mar 6, 2018

 

పెద్ద సినిమా అంటే.. బ‌య్య‌ర్లు ఎగ‌బ‌డి కొనుక్కునే రోజులు పోయాయి. ఫ్యాన్సీ రేట్ల‌తో క్యూలు క‌ట్టే కాలం కాదిది. ఎంత‌టి సినిమా అయినా పంపిణీదారులు ఆచి తూచి స్పందిస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్‌, అజ్ఞాత‌వాసిల ఎఫెక్ట్ అలాంటిది. అవ‌న్నీ పంపిణీదారుల్ని నిలువునా ముంచేశాయి. ఈ దెబ్బ‌కు వాళ్లంతా క‌ళ్లు తెర‌చుకున్నారు.  స్టార్లున్నంత మాత్రాన ప‌ని అవ్వ‌ద‌ని సినిమాలో విష‌యం ఉండాల‌ని గ్ర‌హించారు. ఆ ఎఫెక్ట్ రాబోయే సినిమాల‌పై ప‌డింది.  ఈ వేస‌వికి చాలా సినిమాలు క్యూ క‌డుతున్నాయి. దాదాపు అన్నీ మంచి డిమాండ్ ఉన్న‌వే. కొన్నింటికి మార్కెట్లు ఓపెన్ అయిపోయాయి. కానీ `రంగ‌స్థ‌లం` కొన‌డానికి మాత్రం ఎవ్వ‌రూ సాహ‌సించ‌డం లేదు.

రామ్ చ‌ర‌ణ్ సినిమా అంటే.. మాస్‌కి పండ‌గే. బీ,సీల్లో చ‌ర‌ణ్ సినిమాకి భ‌లే డిమాండు. సుకుమార్‌కి ఏ సెంట‌ర్ల‌లో గ్రిప్ ఉంది. కాబ‌ట్టి ఈ సినిమా.. అన్ని ఏరియాల్లోనూ మంచి రేట్ల‌కు అమ్ముడుపోతుంద‌ని నిర్మాత‌లు భావించారు. కానీ సీన్ అక్క‌డే రివ‌ర్స్ అయ్యింది. చ‌ర‌ణ్ సినిమా అనే ముద్ర ప‌డినందున ఓవ‌ర్సీస్‌లోనూ, అటు ఏ సెంట‌ర్ల‌లోనూ ఈ సినిమాని కొన‌డానికి ఎవ్వ‌రూ ఆస‌క్తి చూపించ‌డం లేదు. సుకుమార్ సినిమా కాబ‌ట్టి.. బీ, సీ సెంట‌ర్ల వాళ్లూ మొగ్గు చూపించ‌డం లేదు. పైగా రంగ‌స్థ‌లం రీషూట్ల‌కు వెళ్లింద‌ని ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాంతో సినిమా ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. రీషూట్ల‌కు వెళ్లిన ఏ సినిమా... బాగా ఆడిన‌ట్టు తెలుగు చ‌ల‌న చిత్ర సీమ చ‌రిత్ర‌లోనే లేదు. పైగా రిలీజ్ డేట్ మారిన సినిమాల‌పైనా ఎవ్వ‌రికీ న‌మ్మ‌కాలు ఉండ‌వు. అందుకే `రంగ‌స్థ‌లం`ని అంద‌రూ లైట్ తీసుకుంటున్నారు. ట్రైల‌ర్ వ‌స్తే.. త‌ప్ప‌, మిగిలిన పాట‌లన్నీ వినేస్తే త‌ప్ప‌.. ఈ సినిమాపై ఎవ్వ‌రికీ న‌మ్మ‌కాలు కుద‌ర‌వు. విడుద‌ల‌కు సిద్ధ‌మై కూడా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏరియాల వారిగా మార్కెట్ మొద‌ల‌వ్వ‌లేదంటే.. ఈ సినిమా దుస్థితి ఏంటో అర్థ‌మైపోతోంది. మ‌రి.. రంగ‌స్థ‌లాన్ని కొనే నాధుడెవ్వ‌డో..!

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here