రామ్‌చరణ్ ఇంతగా మారిపోతాడనుకోలేదు..!!
on Feb 12, 2018
మూడు గంటల పాటు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు.. హీరో క్లీన్ షేవ్‌తో, ఫార్మల్ డ్రెస్‌తో, రాముడి మంచి బాలుడిలా ఉంటే ఇప్పటి జనాలకు నచ్చదు.. కండలు పెంచాలి.. అవసరమైతే బక్కచిక్కాలి.. ట్రెండ్‌కు తగ్గట్టు కంప్లీట్‌గా మేకోవర్ అవ్వాలి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒకే రకమైన హెయిర్ స్టైల్‌తో, ఫిజిక్‌తో కనిపించిన.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ఇక మారాల్సిందేనని గట్టిగా ఫిక్సయినట్లున్నాడు.. ధ్రువలో బాడీతో పాటు హెయిర్ స్టైల్‌ను చేంజ్ చేసిన చెర్రీ.. తన రీసెంట్ మూవీ రంగస్థలం కోసం లుక్‌ను మార్చేశాడు.
1980ల నాటి పల్లెటూరి అబ్బాయిలా కనిపించడం కోసం.. గెడ్డం పెంచుకుని.. గల్ల లుంగీ కట్టుకొన్నాడు.. చరణ్‌ను చూసి ఆయన అభిమానులు కూడా గెడ్డాలు.. మీసాలు పెంచేస్తున్నారు. ఏడాదిన్నర నుంచి సాగుతున్న "రంగస్థలం" షూటింగ్‌కు సుకుమార్ పేకప్ చెప్పేయడంతో.. తన గెడ్డానికి కూడా చెర్రీ వీడ్కోలు పలికేశాడు. సెలూన్లో సేవింగ్ చేయించుకుంటున్న ఫోటోలను చరణ్ పోస్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత మాస్ సినిమాల స్పెషలిస్ట్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ నటిస్తున్నాడు.. ఈ నెల 16 నుంచి ఈ మూవీ తొలి షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది.