'కేతిక శర్మ' కిస్ నెక్స్ట్ లెవెల్ అంటున్న 'వైష్ణవ్ తేజ్'!
on Jan 24, 2022
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 'కొండపొలం' సినిమాతోనూ మెప్పించిన వైష్ణవ్.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా తన మూడో సినిమా చేస్తున్నాడు. 'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ గా తెరకెక్కిన 'ఆదిత్య వర్మ' డైరెక్టర్ గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్ ని విడుదల చేశారు మేకర్స్.
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూడో సినిమాకి 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ టీజర్ ఆకట్టుకుంటోంది. టైటిల్ కి తగ్గట్లే హీరోహీరోయిన్ మధ్య చూపించిన రొమాంటిక్ సీన్ బ్యూటిఫుల్ గా ఉంది. టైటిల్ టీజర్ లో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ లుక్స్ ని రివీల్ చేశారు. 'నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా?' అని కేతిక అడగగా.. 'బటర్ ఫ్లై కిస్ ఆ!' అంటూ వైష్ణవ్ ఆశ్చర్యంగా చూస్తాడు. వైష్ణవ్ ని దగ్గరకు తీసుకొని కేతిక ముద్దు పెట్టుకోగా 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్ రివీల్ అయింది. 'ఎలా ఉంది?' అని కేతిక అడగగా 'నెక్స్ట్ లెవల్ లో ఉంది' అని వైష్ణవ్ చెప్పాడు. మొత్తానికి టైటిల్ టీజర్ తోనే సినిమాపై ఆసక్తి కలిగేలా చేశారు.
వైష్ణవ్ హీరోగా మరో మూవీ కూడా సైన్ చేశాడు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
Also Read