రానా ప్రేమకథలో వెంకీ కూతురు పాత్ర ఏమిటంటే?
on May 23, 2020
రానా ప్రేమకథ చాలామందికి షాక్ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు. అందుకు కారణం ఏంటంటే... గతంలో పలువురు కథానాయికలతో రానా ప్రేమ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. మిహీకా బజాజ్ హీరోయిన్ కాదు. మరి, ఎవరు ఈ అమ్మాయి? రానాకు ఎలా పరిచయం? అసలు వీళ్ళ ప్రేమ కథ ఏమిటి? అని తెలుసుకోవాలని అనుకున్నారు. ఇంస్టాగ్రామ్ లైవ్ లో లక్ష్మీ మంచుకి తన ప్రేమ, పెళ్లి సంగతుల గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు రానా. ఈ ప్రేమకథలో వెంకటేష్ కుమార్తె అశ్రిత పాత్ర ఏమిటి? మిహీకాను ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత రానా తల్లిదండ్రులు సురేష్ బాబు లక్ష్మి రియాక్షన్ ఏంటి?
"అశ్రితకు మిహీకా క్లాస్ మేట్. పైగా మన ఇంటి పక్కనే ఉంటుంది. ఎప్పటినుంచో తనతో పరిచయం ఉంది. అయితే, లాక్ డౌన్ కి ముందు తనే నాకు కాబోయే శ్రీమతి అని ఫిక్స్ అయ్యాను. మంచి పనులు జరుగుతున్నప్పుడు ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించుకోవడం నాకు అలవాటు లేదు. తనకి ప్రపోజ్ చేసినప్పుడు షాక్ అయింది. తర్వాత సంతోషపడింది. పేరెంట్స్ రియాక్షన్ కూడా అంతే ఫస్ట్ షాక్ అయ్యారు. తర్వాత హ్యాపీగా ఫీలయ్యారు. ఇంట్లో అందరూ నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కాబట్టి హ్యాపీ" అని రానా చెప్పాడు.
ఇంట్లో వాళ్లకు, తనకు రానా ప్రేమ విషయాన్ని ఎలా చెప్పింది మంచు లక్ష్మి వివరించారు. "నాకు ఒక్క నిమిషంలో ప్రేమ కథ చెప్పాడు. కోక్ బాటిల్ మూత ఓపెన్ చేసి గ్లాసులో పోసుకుని లోపల చెప్పేసి వెళ్ళిపోయాడు. షాక్ నుండి తేరుకోవడానికి నాకు పది నిమిషాలు పట్టింది. రానా మదర్ లక్ష్మి ఆంటీ కి ఫోన్ చేశా. రెండేసి నిమిషాల చొప్పున మూడు రోజుల్లో మూడు సార్లు ప్రేమ విషయం చెప్పాడని ఆంటీ చెప్పారు" అని లక్ష్మీ మంచు అన్నారు.