మిహీకాతో ఏడడుగులు నడిచిన రానా
on Aug 8, 2020
తెలుగు చిత్రసీమలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ నుంచి రానా దగ్గుబాటి వైదొలిగాడు. శనివారం రాత్రి 8:30 గంటలకు ఈ 35 ఏళ్ల అందగాడు తన ఫియాన్సీ మిహాకీ బజాజ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వారి వివాహ వేడుక సింపుల్‌గా జరిగింది.
కరోనా మహమ్మారి నిబంధనల మేరకు వివాహ వేదిక వద్ద శానిటైజర్ స్టాండ్స్, ఫేస్ మాస్క్‌లు, డిసిన్ఫెక్టెంట్ టన్నెల్స్‌ను ఏర్పాటు చేశారు. అతిథులు భౌతిక దూరాన్ని పాటిస్తూ వేడుకలో పాల్గొన్నారు. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు అక్కినేని ఫ్యామిలీ, అల్లు అర్జున్ వంటి కొద్దిమంది రానా స్నేహితులు ఇందులో పాల్గొన్నారు.
వర్షాకాలం కావడం, గత కొద్ది రోజులుగా ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో పెళ్లి వేడుకకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా వేదికను వాటర్-ప్రూఫింగ్గా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకున్నారు. మిహీకా, ఆమె తల్లి బంటీ.. ఇద్దరూ ఈవెంట్ ప్లానర్స్ కావడంతో పెళ్లి వేదిక ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగని రీతిలో వేదికను తీర్చిదిద్దారు.
Also Read