రానాది అరుదైన వ్యాధి... అసలేం జరిగిందంటే?
on Nov 23, 2020
రానా దగ్గుబాటి ఏమైంది? ఆయన ఎందుకు అన్ని రోజులు అమెరికాలో ఉన్నారు? కిడ్నీ మార్పిడా... లేదా మరో వ్యాధి ఏదైనా ఉందా? గతేడాది చాలామంది పరిశ్రమ ప్రముఖుల్లో, ప్రేక్షకుల్లో మది గది నిండా ఎన్నో సందేహాలు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిందని తెలిసింది. అయితే, అసలు రానాకి ఏమైందనేది చాలామందికి తెలియలేదు. 'సామ్-జామ్' షోలో తనకి ఏమైందో రానా చెప్పాడు. అసలు నిజం బయట పెట్టాడు. నవంబర్ 27న రానా ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. రీసెంట్ గా ప్రోమో రిలీజ్ చేశారు.
"లైఫ్ ఫాస్ట్ ఫార్వార్డ్ లో వెళుతున్నప్పుడు సడన్ గా చిన్న పాజ్ బటన్ వస్తుంది. పుట్టినప్పటి నుండి బీపీ ఉంది. హార్ట్ చుట్టూ కాల్సిఫికేషన్ (దీని వలన జీవ కణాలు గట్టిపడతాయి) ఉంది. నాకు ఫెయిల్డ్ కిడ్నీలు ఉన్నాయని చెప్పారు. 70 శాతం స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. 30 శాతం మరణించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు" అని రానా దగ్గుబాటి చెప్పారు. దీన్ని బట్టి రానాకి కిడ్నీ మార్పిడి జరిగిందని ఊహించవచ్చు. అలాగే, తనకు ఉన్న హార్ట్ ప్రాబ్లమ్ కూడా చెప్పాడు. ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
రానా వైఫ్ మిహీకా బజాజ్ ను వీడియో కాల్ ద్వారా షోలోకి సమంత తీసుకొచ్చారు. బై మిస్టేక్ రానా తనకు కాల్ చేశాడని ఆమె చెప్పడం, కాల్ చేసిన తరవాత ఆమె తన అమ్మాయి అని డిసైడ్ చేశానని రానా
అనడం నవ్వులు పూయించాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
