హల్దీ వేడుకలో మెరిసిన రానా, మిహీకా
on Aug 6, 2020
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకటైన రానా దగ్గుబాటి రెండు రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్, డ్యూ డ్రాప్ డిజైన్ కంపెనీ యజమాని అయిన మిహీకా బజాజ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంటున్నాడు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆగస్ట్ 8 శనివారం అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో వారి వివాహ వేడుక జరగనున్నది.
గురువారం నుంచే పెళ్లి వేడుక మొదలైంది. ఈ రోజు జరిగిన హల్దీ వేడుకలో వధూవరులిద్దరూ పాల్గొన్నారు. రానా ఎప్పటిలా వైట్ అండ్ వైట్ పంచె, షర్టు ధరించగా, మిహీకా పసుపురంగు వస్త్రాల్లో మెరిసింది. ఆ ఇద్దరూ సోఫాపై అతి సన్నిహితంగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం రాత్రి 8:30 గంటలకు పెళ్లి ముహూర్తంగా నిర్ణయించారు.