పసుపు... కుంకుమ...రానా పెళ్లి హంగామా
on Aug 6, 2020
తెల్లపంచె, తెల్ల షర్టు... టాప్ టు బాటమ్ తెల్ల దుస్తుల్లో రానా దగ్గుబాటి తళతళ మెరిసిపోయాడు. పసుపు రంగు డ్రస్‌లో బంగారు వధువులా మేనిఛాయతో మిహీకా బజాజ్ ముస్తాబయ్యింది. సోఫాలో ఇద్దరూ జంటగా కూర్చుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టున్నారు. వాళ్లిద్దరి నవ్వులు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నాయి. మొత్తం మీద రానా పెళ్లి సందడి మొదలైంది. బుధవారం మిహీకా బజాజ్ ఇంట్లో పుసుపు–కుంకుమ ఫంక్షన్ జరిగింది. తరవాత గురువారం రానా ఇంట్లో ఫంక్షన్‌తో సందడి తారాస్థాయికి వెళ్లిందట. గురువారం రాత్రి మెహందీ ఫంక్షన్‌కి పింక్ కలర్ డ్రస్‌లో మిహీకా ముస్తాబయ్యింది. రానా పెళ్లి సందడి ప్రేక్షకులకు సంతోషాన్నిచ్చిందని చెప్పాలి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానిది మూడు తరాల చరిత్ర. సాధారణంగా అయితే ఇండస్ట్రీలో హేమాహేమీలంతా రానా పెళ్లి వేడుకలో పాల్గొనేవారు. వచ్చి వధూవరులను ఆశీర్వదించేవారు. కరోనా కారణంగా ఎవర్నీ ఆహ్వానించడం లేదు. కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో పెళ్లి నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.