ఫారిన్ బీచ్‌లో రానా-మిహీకా హనీమూన్!
on Oct 17, 2020
జ్యుయెలరీ డిజైనర్ మిహీకా బజాజ్‌తో ప్రేమలో పడిన రానా దగ్గుబాటి ఈ ఏడాది ఆగస్ట్‌లో రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఇంటిమేట్ సెర్మనీలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ప్రస్తుతం ఆ ఇద్దరూ హనీమూన్‌లో ఉన్నారు. బయటకు వెల్లడించని ఒక ఫారిన్ బీచ్ సమీపంలో వారు ఆనందంగా తమ సమయాన్ని గడుపుతున్నారు. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా మిహీకా షేర్ చేసిన సెల్ఫీ పిక్చర్తో ఈ విషయం తెలిసింది.
ఆ ఇద్దరూ బీచ్‌లో ఆహ్లాదంగా గడుపుతున్నట్లు ఆ పిక్చర్‌ను బట్టి అర్థమవుతోంది. ఆ సెల్ఫీని రానా తీశాడు. ఆ ఫొటోకు "జస్ట్ బికాజ్ రానా దగ్గుబాటి" అనే క్యాప్షన్ జోడించింది మిహీకా. ఆ పిక్చర్లో ఇద్దరూ బీచ్‌వేర్‌లో కనిపిస్తున్నారు. తమ హనీమూన్ లొకేషన్‌ను మిహీకా రివీల్ చేయకపోయినప్పటికీ, పెళ్లి తర్వాత ఆ ఇద్దరూ తొలిసారి కనిపించిన ఫొటోతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.
మార్చిలో లాక్డౌన్ విధించినప్పట్నుంచీ రానా ఇంతదాకా తన సినిమా సెట్స్ మీదకు రాలేదు. అయితే ఇదే టైమ్‌లో మిహీకాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన రెండు నెలలకు భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్‌కు వెళ్లాడు. నవంబర్‌లో అతను 'విరాటపర్వం' షూటింగ్‌కు వస్తాడని ఆ సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Also Read