నన్ను వదిలేయండి బాబోయ్` అంటోన్న రానా!!
on Feb 23, 2019
ఇటీవల బాలీవుడ్ చిత్రం `గల్లీబాయ్ `విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు గత వారం రోజలుగా గా సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ రీమేక్ రైట్స్ అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ రీమేక్ మొదట సాయి ధరమ్ తేజ్ చేసే అవకాశాలున్నట్లు న్యూస్ వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంగ్లీష్ పేపర్ ఇంట్రస్టింగ్ న్యూసొకటి ప్రచురించింది. అదేమిటంటే... బన్ని, రానా, విజయ్ దేవరకొండ వీరిలో ఎవరు `గల్లీబాయ్ ` రీమేక్ లో నటిస్తే సూటవుతారని సోషల్ మీడియాలో ఓటింగ్ నిర్వహించింది. ఈ మేరకు ఆ పత్రిక చేసిన ట్వీట్ ను చూసిన రానా `నన్ను వదిలేయండి` నాకు అంత నైపుణ్యత లేదు ` అంటూ నవ్వుతూ ఎమోజీలను షేర్ చేసారు. ` నువ్వు గొప్ప నటుడువు, మీరు ఏదైనా స్పెషల్ గా ఉంటేనే నటిస్తారంటూ `` కొంత మంది నెటిజన్లు బదులిచ్చారు. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ బాలీవుడ్ చిత్రం ప్రస్తుతం అక్కడ మంచి ప్రజాదరణ పొందుతోంది. కలెక్షన్స్ పరంగా కూడా బాగుండటంతో దీన్ని వివిధ భాషల్లో రీమేక్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం చివరికి తెలుగులో ఎవరు చేస్తారో.