కేకుల్లా టేకులు తీసుకున్న శివగామి!!
on Mar 12, 2019
`బాహుబలి` శివగామి పాత్ర చేసిన దగ్గర నుంచి నటి రమ్యకృష్ణ పిచ్చ పాపులారిటీ పెరిగిపోయింది. ఆ తర్వాత నుండి ఆమెకు మళ్లీ సినిమా ఆఫర్స్ విపరీతంగా వస్తున్నాయి. కానీ, చాలా సెలక్టివ్ గా స్టోరీస్ ఎన్నుకుంటూ వెళ్తోంది రమ్యకృష్ణ. అందులో భాగంగానే తమిళంలో `సూపర్ డీలక్స్` అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రతో పాటు విజయ్ సేతుపతి , సమంత కీలక పాత్రల్లో నటిస్తున్నారట. అయితే ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ గా కనిపించనుందని సమాచారం. అయితే నటిగా ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న రమ్య కృష్ణ ఇందులో ఒక సీన్ కోసం దాదాపు 38 టేకులు తీసుకుందట. ఈ విషయం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. దీనిపై రమ్యకృష్ణ స్పందిస్తూ....``ఇది నా సినీ కెరీర్ లోనే ఎంతో ఛాలెంజింగ్ రోల్ అనీ, కొన్ని పాత్రలు పేరు కోసం చేస్తాం...మరి ఇంకొన్ని పాత్రలు మనీ కోసం చేస్తాం కానీ ఇలాంటి పాత్రలు మాత్రం సినిమా మీద ఉన్న ప్యాషన్ తో చేస్తామంటూ చెప్పకొచ్చింది శివగామి. నటన మీద ఎప్పటికీ వ్యామోహం తీరదు అంటే ఇదేనేమో మరి.