రమ్యకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?
on Sep 15, 2020
ఓ మంగ (హలో బ్రదర్)... ఓ తిమ్మక్క (అన్నమయ్య)... ఓ నీలాంబరి (నరసింహా)... ఓ శివగామి (బాహుబలి)... ఓ సత్యభామ (సోగ్గాడే చిన్ని నాయన)... ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన నటి రమ్యకృష్ణ. నటనలో ఆమె హావభావాలు అద్భుతం. కథానాయికగా, నటిగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆమె పుట్టినరోజు నేడు. ఈ ఏడాది సెప్టెంబర్ 15తో రమ్యకృష్ణ 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు 50వ పుట్టినరోజును రమ్యకృష్ణ జరుపుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి 12 గంటలు దాటి 15వ తేదీ రాగానే రమ్యకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య జరిగాయి. ప్రముఖ దర్శకుడు, ఆమె భర్త కృష్ణవంశీతో సహా కుమారుడు కూడా పాల్గొన్న ఈ వేడుకలో దర్శకుడు సురేందర్‌రెడ్డి ఫ్యామిలీ, తమిళనటుడు విజయ్‌కుమార్ కుమార్తె రుక్మిణి, రామ్‌చరణ్ మేనేజర్ ప్రవీణ్ తదితరులు సందడి చేశారు. హైదరాబాద్‌లోని కృష్ణవంశీ ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగినట్టు తెలుస్తోంది. తెలుగువన్ డాట్ కామ్ తరఫున రమ్యకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు.
Also Read