మాదే ముందు అంటున్న రమ్యకృష్ణ
on Dec 9, 2019
రీమేక్ చేస్తే ఓ తలనొప్పి ఉంటుంది. ఒరిజినల్ సినిమాతో కంపేరిజన్స్ వస్తాయి. ఒరిజినల్లో హీరో ఏం చేశాడు? రీమేక్‌లో హీరో ఎలా చేశాడు? అని సీన్ టు సీన్, ఎమోషన్ టు ఎమోషన్ చెక్ చేసే విమర్శకులు, విశ్లేషకుల సంఖ్య తక్కువేం కాదు. అటువంటిది సేమ్ క్యారెక్టర్ ఇద్దరు చేస్తే ఎవరు ఎలా చేశారని విశ్లేషించకుండా ఉంటారా? జయలలితగా కంగనా రనౌత్, రమ్యకృష్ణ నటనను విశ్లేషించడం మొదలుపెట్టారు.
జయలలితగా కంగనా రనౌత్ సినిమా చేస్తున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్టర్. ఈ సినిమా టైటిల్ ‘తలైవి’. జయలలితగా రమ్యకృష్ణ నటిస్తున్నది వెబ్ సిరీస్. గౌతమ్ మీనన్ ఓ డైరెక్టర్‌గా చేస్తున్నారు. టైటిల్ ‘క్వీన్’. ఆల్రెడీ రెండిటి టీజర్స్ విడుదలయ్యాయి. కంగనాకు మైనస్ మార్కులు పడితే... రమ్యకృష్ణకు మంచి మార్కులు పడ్డాయి. కంగన సినిమా ముందు వస్తుందా? రమ్యకృష్ణ వెబ్ సిరీస్ ముందు వస్తుందా? అనే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వీటికి రమ్యకృష్ణ ఫుల్స్టాప్ పెట్టారు. తమదే ముందు వస్తుందని స్పష్టం చేశారు. ‘‘కంపేరిజన్స్ వస్తాయని నాకు తెలుసు. కానీ, మా షో ముందు విడుదలవుతుంది’’ అని రమ్యకృష్ణ అన్నారు. ‘తలైవి’ వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుంది. అంతకంటే ముందు ‘క్వీన్’ ఇంటర్నెట్లో విడుదలవుతుందన్నమాట!