వర్మ ‘రౌడీ నంబర్ 150’..
on Jan 8, 2017
ఇప్పటికే ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు వర్మపై కామెంట్లు చేయడం...దానికి వర్మ కూడా నాగబాబపై తన దైన శైలిలో సెటైర్లు విసరడం అంతా అయిపోయింది. మంచి హాట్ టాపిక్ గా నడిచిన ఈ మ్యాటర్ కు మరింత కిక్ ఇచ్చేలా మరో ట్వీట్ చేశాడు. ‘అద్దాల మేడలో ఉండే వాళ్లు ఇతరులపై రాళ్లు వేయకూడదు-భగవద్గీత’ అంటూ ట్వీట్ చేశారు. అంతేనా అక్కడితో ఆగకుండా ‘రౌడీ నంబర్ 150’ అంటూ స్టీల్ గ్లాస్‌ను కంటికి అడ్డంగా పెట్టుకుని దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. మరోసారి నాగబాబు ను టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ చేశాడు. ‘చిరంజీవిగారి అభిమానులకు నా క్షమాపణలు. అందుకు కారణం నాగబాబు. ఆయన తరపున కూడా నేనే క్షమాపణలు చెబుతున్నా. దేవుడు చిరంజీవిగారి కుటుంబానికి ఎన్నో పాజిటివ్స్ ఇచ్చాడు. పవన్, చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్, బన్నీ వాటన్నింటినీ నాగబాబుగారితో బ్యాలెన్స్ చేశాడు’ అంటూ వ్యాఖ్యానించారు. మరి దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తాడో చూద్దాం.