రామ్ సినిమా ఆపేశార్ట.. కారణమేంటో..??
on May 21, 2018
'గరుడ వేగ'తరవాత... ప్రవీణ్ సత్తారు కొంతమంది అగ్ర హీరోలకు కథలు చెప్పాడు. చివరికి రామ్‌తో ఓకే అయ్యింది. ఆ సినిమా ఇటీవల క్లాప్ కొట్టుకుంది. ఈనెలలోనే విదేశాల్లో షూటింగ్ కి వెళ్లాలి. అయితే... అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోంది. బడ్జెట్ లెక్కలు మితిమీరాయని, కథలో అక్కడక్కడ కొన్ని డౌట్లు ఉన్నాయని అందుకే.. రామ్ ఈ సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మంచు కొండల నేపథ్యంలో సాగే కథ ఇది. యాక్షన్ కి ఎక్కువ స్కోప్ ఉంది. అందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సివస్తోంది. బడ్జెట్ లెక్కలు చూస్తే.. రామ్ మార్కెట్‌కి దాదాపుగా రెండింతలు ఎక్కువవుతోందట. 'గరుడవేగ' సినిమా మొదలెట్టేముందుకీ, పూర్తయ్యేటప్పటికీ బడ్జెట్లో చాలా మార్పులు వచ్చాయి. ఊహించని విధంగా బడ్జెట్ పెరిగిపోవడం వల్ల 'గరుడవేగ' సినిమా ఆలస్యమైంది. ఆ సినిమా హిట్ టాక్ సంపాదించుకున్నా, మంచి వసూళ్లే అందుకున్నా.. సరైన లాభాలు రాకపోవడానికి కారణం.. మితిమీరిన బడ్జెట్టే. అలాంటి సమస్యే రామ్ సినిమాకీ ఎదురైతే..? అనేదే నిర్మాతల అనుమానం. అందుకే ముందు బడ్జెట్ లెక్కలు సరిచూసుకుని, కథలో లోటు పాట్లు సవరించుకుని అప్పుడు సినిమా మొదలెడదామంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.