English | Telugu

జస్ట్... నాలుగు నెలల్లో రామ్ ఫినిష్ చేశాడు

on Feb 15, 2020

ఇస్మార్ట్ స్పీడుతో రామ్ కొత్త సినిమా షూటింగ్ చేస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ నటిస్తున్న సినిమా 'రెడ్'. అక్టోబర్ 30న సినిమా ప్రారంభమైంది. నవంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. జస్ట్... ఈ నాలుగు నెలల్లో రామ్ సినిమాను ఫినిష్ చేశాడు. 'రెడ్' సినిమా టాకీ పూర్తయింది. ప్రస్తుతం ఇటలీలో సాంగ్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ నెలాఖరుకు సాంగ్స్ షూటింగ్ ఫినిష్ అవుతుంది.  "ఈ నెల 12 నుండి ఇటలీలోని టస్క్, ఫ్లారెన్స్, డోలో మైట్స్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నాం. ఈ నెల 20 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఇందులో రామ్, మాళవిక శర్మపై శోభి మాస్టర్ కోరియోగ్రఫీలో రెండు పాటలు చిత్రీకరిస్తున్నాం.  ఈ షెడ్యూల్ తో ఒక్క పాట మినహా సినిమా పూర్తవుతుంది. హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత మరో పాటని చిత్రీకరించనున్నాం" అని 'రెడ్' నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ తెలిపారు. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాల తర్వాత రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేయనున్నారు.


Cinema GalleriesLatest News


Video-Gossips