రామ్‌తో `జాతిరత్నాలు` దర్శకుడు?
on Apr 6, 2021
ఈ మార్చి మాసం బ్లాక్ బస్టర్ మూవీ `జాతిరత్నాలు`తో పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు అనుదీప్. అంతకుముందు `పిట్టగోడ` చేసినా రాని గుర్తింపు.. `జాతిరత్నాలు` ఘనవిజయంతో సొంతం చేసుకున్నాడు అనుదీప్. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ తరువాత.. అనుదీప్ ఎవరితో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు? అన్నదే ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో అనుదీప్ నెక్స్ట్ వెంచర్ ఉండే అవకాశముందట. అంతేకాదు.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టాక్. ``జాకీచాన్ స్టంట్స్ చూసి స్ఫూర్తిపొందిన కథానాయకుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత ఏమైందన్నదే?`` ఈ సినిమా కథ అని వినికిడి. త్వరలోనే రామ్, అనుదీప్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
కాగా, నవీన్ పోలిశెట్టితోనే మరో సినిమా చేసే ఆలోచనలోనూ అనుదీప్ ఉన్నాడట. అలాగే విమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ కూడా రెడీ చేసుకున్నాడట. మొత్తానికి.. అనుదీప్ తదుపరి చిత్రం ఎవరితోనైనా.. అది `జాతిరత్నాలు` నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ లోనే ఉండొచ్చని ఫిల్మ్ నగర్ ఇన్ఫర్మేషన్.
Also Read