మహానాయకుడితో కయ్యానికి వర్మ ముందగుడు!
on Feb 1, 2019
దర్శకుడు రామ్ గోపాల్ వర్మను స్వర్గంలో వున్న నందమూరి తారకరామారావు హెచ్చరించారట... 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా విడుదల తేదీ ప్రకటించిన 24 నిమిషాల్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ విడుదల చేయమని! 'ఎన్టీఆర్ మహానాయకుడు' విడుదల తేదీ, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ విడుదల మధ్య క్లాష్ తప్పదని వర్మ అంటున్నారు. గురువారం రాత్రి ఆయన చేసిన ట్వీట్స్ చూస్తుంటే... మహానాయకుడితో కయ్యానికి వర్మ ముందడుగు వేస్తున్నట్లుంది! ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ప్రచారంతో పోటీ పడటానికి, ఆ సినిమా ప్రచారానికి పోటీగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రచారం చేయడానికి వర్మ సుముఖంగా ఉన్నట్టుంది. అంతే కాదు.. మహానాయకుడు విడుదల రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేయాలని చూస్తున్నట్లుంది. బాలకృష్ణ నటించిన కథానాయకుడు చిత్రాన్ని ఎన్టీఆర్ ఆశీర్వదించలేదని వర్మ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ శ్రీమతి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. అందుకు ఉదాహరణ... 'ఎన్టీఆర్ మహానాయకుడు', 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల మధ్య ఎన్టీఆర్ క్లాష్ కోరుకుంటున్నారని వర్మ ట్వీట్ చేశారు.