బాహుబలిని చూసి కుళ్ళుకుంటున్నారా ?
on Mar 18, 2017
ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది కన్క్లూజన్’ ట్రైలర్ వచ్చేసింది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చినీ ట్రైలర్ .. ‘బాహుబలి 2’పై అంచనాల్ని మరింతగా పెంచేసింది. కేవలం విడుదలైన ఎనిమిది గంటల్లోనే కోటి వ్యూస్ ను సొంతం చేసుకొని అల్ టైం రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడీ ట్రైలర్ పై ప్రసంశల జల్లుకురుస్తోంది. అయితే ఈ ప్రసంశల్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రసంశలు ఒక్కింత వెరైటీగా, ఘాటుగా, మిగతా వారిని గిల్లే విధంగా వున్నాయి.
''బాహుబలి-2’ ట్రైలర్ లో ప్రభాస్, పదివేల మంది అందమైన అమ్మాయిల కన్నా అందంగా వున్నాడు. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ కాలి గోటిని అందుకోవడానికి టాలీవుడ్ లోని ''పవర్ ఫుల్ మెగా సూపర్ స్టార్' లందరికీ కూడా రెండున్నర జన్మలు పడుతుంది. టాలీవుడ్ పవర్ ఫుల్ స్టార్లు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేసి ఘోరంగా ఫెయిల్ అయి, లోకల్ అయిపోయారు. కాని ప్రభాస్ రెండు దెబ్బలతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. బాహుబలి-2’ ట్రైలర్ ను చూసి ప్రపంచ మంతా జై కొడుతున్నా టాలీవుడ్ మాత్రం సూపర్ సైలెంట్ గా ఉండటానికి కారణం కుళ్లు సముద్రంలో మునిగిపోవడం మూలాన.''.. ఇలా సాగుతోంది బాహుబలిపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ గేమ్.
అయితే రామ్ గోపాల్ వర్మ ఇంటెన్స్ ఏమిటో అందరికీ తెలుసు.'పవర్ ఫుల్ మెగా సూపర్ స్టార్లు అని ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్లు కోడతున్నారో, ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదేదో బాహుబలి సినిమా విపరీతంగా నచ్చేసి ఈ ట్వీట్లు పెట్టడం లేదు ఆర్జీవీ. ఆయనికి ఓ వివాదం కావాలి. అది బాహుబలి రూపంలో దొరికిందంతే. అన్నట్టు.. వర్మ నుండి వచ్చిన ఈ ట్వీట్లు తెలుగులో వచ్చాయి. మొన్న కూడా అంతే. మెగాస్టార్ మేటర్ లో తెలుగు ట్వీట్లు నావికాదు. ఎవరో హ్యాక్ చేశారని ప్లేటు ఫిరాయించాడు వర్మ. ఇప్పుడు ఏదైనా మళ్ళీ తేడా కొడితే.. ''సారీ.. బాహుబలి తెలుగు ట్వీ ట్లు నావికాదు''అనే చెప్పేయగల సమర్ధుడు వర్మ.