వరుణ్ తేజ్ మీమ్ అప్‌డేట్.. 'ఆచార్య' టీజర్‌కు చరణ్ వాయిస్ ఓవర్?
on Jan 27, 2021
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న 'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్‌ను ఈ రోజు ఉదయం డైరెక్టర్ కొరటాల శివ రివీల్ చేశాడు. జనవరి 9 సాయంత్రం 4:05 గంటలకు టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. కొత్త సంవత్సరం, సంక్రాంతి, రిపబ్లిక్ డే లాంటి అకేషన్స్‌కు 'ఆచార్య' నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడం వారిని తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. ఇప్పుడు టీజర్‌ను 29న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో వాళ్లు సంబరపడుతున్నారు.
కాగా ఆచార్యకు సంబంధించిన అప్‌డేట్స్ గురించి మెగాస్టార్ సహా మెగా హీరోలు మీమ్స్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రచ్చరచ్చ చేస్తుండటం విశేషం. బుధవారం సాయంత్రం తనకూ, కొరటాలకూ మధ్య జరిగిన సంభాషణను మీమ్స్ రూపంలో చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఆ మీమ్ స్టోరీని వైరల్ చేశారు.
తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఆచార్య' టీజర్‌కు సంబంధించిన మరో అప్‌డేట్‌ను మీమ్ రూపంలో షేర్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ మీమ్‌లో "చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా టీజర్‌కి" అని ఓ మీమ్‌కు, "ఆహా.. బయట టాకు" అని ఇంకో మీమ్‌కు క్యాప్షన్ పెట్టి షేర్ చేశాడు. గిరిబాబుతో బ్రహ్మానందం మాట్లాడుతున్న మీమ్‌ను దానికి వాడాడు. ఆ మీమ్‌కు #AcharyaTeaser అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు. తన పోస్ట్‌ను చిరంజీవి, చరణ్‌లకు ట్యాగ్ చేశాడు వరుణ్. దీంతో 'ఆచార్య' టీజర్‌కు రామ్‌చరణ్ నిజంగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
