రంగస్థలం రిపోర్ట్ ఏంటో చెప్పేసాడుగా
on Mar 9, 2018
ఒక సినిమాకి ఫస్ట్ క్రిటిక్ ఆ సినిమాకి పని చేసే ఎడిటర్. ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని సినిమాకి ఎక్కడ కత్తెర్లు వేయాలి, సీన్స్ ఏ ఆర్డర్ లో పడితే టైట్ అవుతుందో తెలుసు కాబట్టి... దాదాపు ఎడిటర్ ని మరో డైరెక్టర్ అని పిలుస్తారు. వాస్తవానికి, ప్రతి సినిమాని మొదట చూసేది కూడా ఎడిటరే. కొందరు డైరెక్టర్లు తమ ఎడిటర్లని ఫైనల్ అవుట్ పుట్ గురించి వాకబు చేసే అలవాటు ఉంటుంది, ఎందుకంటే ఎడిటరే మొదటి ప్రేక్షకుడు కూడా కాబట్టి. ఇక అసలు విషయానికి వస్తే, రామ్ చరణ్ రంగస్థలం కి ఎడిటర్ గా పనిచేసిన నవీన్ నూలి సినిమా భవితవ్యం ఏంటో చెప్పేసాడు. త్వరలో మీరు ఒక బ్లాక్బస్టర్ సినిమా చూడబోతున్నారు అని రంగస్థలం రిపోర్ట్ ఏంటో చెప్పేసాడు. ఇప్పటికే, చరణ్ సినిమా కోసం ఉత్సుకతగా ఎదురుచూస్తున్న మెగాభిమానులకు ఎక్సపెక్ట్షన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలయిన ఒక టీజర్, మూడు పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. త్వరలో ఆడియో లాంచ్ చేసి, ఈ నెల 30 కి సినిమా రిలీజ్ కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. డిఫరెంట్ సినిమాలు తీసే పేరున్న డైరెక్టర్ సుకుమార్, రంగస్థలం తో పెద్ద ఎక్స్పరిమెంట్ చేస్తున్నాడు. చరణ్ చెవుడు ఉన్న వ్యక్తిగా, సమంత మూగమ్మాయిగా కనిపించనుంది. అయితే, సినిమా సాంతం ఫుల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారని వినికిడి.