రేపు 'రామరాజు ఫర్ భీమ్' టీజర్.. ఈరోజే తారక్‌ను టీజ్ చేసిన చరణ్!
on Oct 21, 2020
'ఆర్ఆర్ఆర్' మూవీలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ బుధవారం తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియోను షేర్ చేసి, ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తోన్న కొమరం భీమ్ క్యారెక్టర్ టీజర్‌ను రేపు ఉదయం 11 గంటలకు రివీల్ చేస్తానని వెల్లడించాడు. ఇది తారక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే వారు రేపు తమ హీరో క్యారెక్టర్ టీజర్‌ను నిర్మాతలు నేరుగా రిలీజ్ చేస్తారని ఎదురుచూస్తూ వస్తున్నారు. రామ్‌చరణ్ క్యారెక్టర్ టీజర్ Bheem For Ramaraju పేరిట ఆయన బర్త్‌డేకి విడుదలవగా, తారక్ బర్త్‌డేకి అతని క్యారెక్టర్ టీజర్‌ను నిర్మాతలు విడుదల చేయలేకపోయారు. కారణం.. కరోనా మహమ్మారి వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు.
వీడియోను షేర్ చేస్తూ రామ్‌చరణ్, "బ్రదర్ తారక్.. ఇక్కడ నిన్ను టీజ్ చేసేది ఒకటుంది.. కానీ నీలా కాకుండా, నేను #RamarajuForBheem రేపు టైమ్‌కు వచ్చేట్లు చూస్తాను." అని ట్వీట్ చేశాడు. దీన్ని తారక్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, చమత్కారంగా రిప్లై ఇచ్చాడు. "బ్రో.. రామ్‌చరణ్.. నువ్వు ఇప్పటికే 5 నెలలు ఆలస్యమయ్యావని గ్రహిస్తావని ఆశిస్తాను. జాగ్రత్త, నువ్వు జక్కన్న (రాజమౌళి)తో డీల్ చేస్తున్నావు! ఏదైనా జరగొచ్చు!! ఏదేమైనా, వేచి ఉంటాను.. ఫుల్లీ ఎగ్జైటెడ్" అని ట్వీట్ చేశాడు.
అయితే దీన్ని అంతటితో వదిలి పెట్టే మూడ్‌లో లేడు చరణ్. సంభాషణను కంటిన్యూ చేస్తూ, "నన్ను నమ్ము, ఈ ఆలస్యానికి విలువ ఉంది. రేపు ఉదయం 11 గంటలు.." అని సమాధానమిచ్చాడు. చరణ్ షేర్ చేసిన వీడియోలో ఒక చేయి నీటిలోంచి ఈటెను బయటకు తీస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఆ తీయడంలో ఒక ఉద్వేగం ఉన్నట్లు బీజీఎం ద్వారా అర్థమవుతోంది. ఆ చేయి కొమరం భీమ్ పాత్రధారి తారక్దని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా!!
Also Read