'ఆర్ఆర్ఆర్': మలయాళంలో రామ్ చరణ్ చెప్పలేదుగా!
on Oct 22, 2020
లేటుగా వచ్చినా కొమురం భీమ్ గా 'ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను లేటెస్ట్ గా చూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. తారక్ గెటప్, బాడీ దగ్గర నుండి రాజమౌళి టేకింగ్ వరకు టీజర్ లో ప్రతి ఫ్రేమ్ బాగుంది. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
ఎన్టీఆర్, రాజమౌళితో పాటు రామ్ చరణ్ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటి అనుకుంటున్నారా? ఈ టీజర్ కి చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీజర్ లో డైలాగులను అగ్రెసివ్ గా... సూపర్ వాయిస్ మాడ్యులేషన్ తో చరణ్ చెప్పాడని ఎన్టీఆర్ అభిమానులు సైతం ప్రశంసిస్తున్నారు.
పాన్ ఇండియా సినిమా గా 'ఆర్ఆర్ఆర్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళం మినహా మిగతా నాలుగు భాషలలోనూ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. బహుశా... మలయాళ ఉచ్చారణ స్పష్టంగా లేకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని మానేసాడేమో! మిగతా నాలుగు భాషలలో అద్భుతంగా డబ్బింగ్ చెప్పాడు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ కి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read