క్యూట్ డార్లింగ్‌తో రామ్‌చరణ్ డాన్స్
on Aug 4, 2020
లాక్డౌన్లో బోర్డమ్ను బీట్ చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కో పని చేస్తున్నారు. ఇంట్లో వంటలు చేసేవాళ్ళు కొందరు. పెరట్లో మొక్కలకు నీళ్ళుపెట్టేవాళ్ళు, పనులు చేసేవాళ్ళూ ఇంకొందరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఈ రోజు మేనకొడలు నివిష్కతో డ్యాన్సులు చేశారు.
చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ రెండో కూతురే ఈ నివిష్క. చిన్నారి వయసు రెండేళ్ల లోపే. అయితే పాటలకు చక్కగా డ్యాన్సులు చేస్తుంది. గతంలో చిరంజీవి ఒడిలో కూర్చుని 'ఖైదీ నంబర్ 150'లో 'మి మి మిమ్మిమ్మి' పాట ప్లే చేయమని మారం చేసింది. ముద్దుముద్దుగా నివిష్క చేసే డ్యాన్సులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మేనకోడలితో కలిసి కార్టూన్ ఛానల్ లో పాట వస్తుంటే డాన్స్ చేశారు. "డాన్సింగ్ ఆఫ్ విత్ థిస్ డార్లింగ్... నివిష్క" అని పేర్కొన్నారు.