'ఆర్ఆర్ఆర్' విడుదల ఎప్పుడు? రామ్ చరణ్ ఏమన్నాడు?
on Jan 6, 2020
డిసెంబర్ నెలాఖరులో 'మత్తు వదలరా' ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. రాజమౌళి అన్నయ్య కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ హీరోగా, పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతదర్శకుడిగా పరిచయమైన చిత్రమది. సొంత మనుషులు సినిమా కావడంతో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మాటల్లో 'ఇంత చిన్న చిత్రాన్ని... వీళ్లే మూడేళ్లు తీసినప్పుడు నేను తీయడంలో తప్పేమైనా ఉందా? నన్ను అడుగుతుంటారు?' అని రాజమౌళి అన్నారు. దాంతో 'ఆర్ఆర్ఆర్' ఈ ఏడాది విడుదల అవుతుందా? లేక 'బాహుబలి'లా వాయిదా పడుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. వీటికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ స్టాప్ పెట్టారు.
విజయవాడలో ఒక కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా గురించి మాట్లాడారు. "షూటింగ్ 70 శాతం వరకు పూర్తయింది. ముందుగా ప్రకటించిన ప్రకారం జూలై 30న 'ఆర్ ఆర్ ఆర్' ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ అన్నారు. ఆయన సరసన సినిమాలో అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం... బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం... వెరసి 'ఆర్ ఆర్ ఆర్' పై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read