రకుల్ కూడా ఆ తప్పు చేస్తుందా...?
on Feb 10, 2018
తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటారు.. ఆ తరువాత బాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ వచ్చిందా అంతే సంగతి.. ఇక్కడి నుండి పెట్టే.. బేడా సర్దుకుని అక్కడికి మకాం మార్చేస్తుంటారు మన హీరోయిన్లు. తెలుగులో దున్నేశాం... ఇక్కడ బాలీవుడ్ లో కూడా దున్నేద్దాం అన్న ఆవేశంతో వెళతారు.. ఆఖరికి చేతులు కాల్చుకుంటారు. ఒక సినిమా.. మా అంటే రెండు సినిమాలు చేస్తారు.. ఆ తరువాత వారిని పలకరించే దిక్కే ఉండదు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది హీరోయిన్లు అలా కలలతో వెళ్లి.. చివరికి కలలు నిజం కాక.. అటు తెలుగుకి.. ఇటు హిందీకి పనికిరాకుండా పోతున్నారు. మరి ఇప్పుడు ఈ జాబితాలో అత్యంత తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరుతుందేమో అని అనిపిస్తుంది. టాప్ హీరోలందరితో నటించి.. టాప్ హీరోయిన్ గా రకుల్ మాంచి స్పీడుమీదున్న టైంలో బాలీవుడ్ లో కాలు పెట్టింది. ఈ భామ సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి ఐ యారీ అనే సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమా హిట్ అయితే ఓకే. ఆ హిట్ పేరతో మరో రెండు మూడు సినిమాలు ఏలాగూ వస్తాయి. అదే కాస్త అటూ ఇటూ అయితే పరిస్థితి చెప్పనక్కర్లేదు. అలా కాకుండా ఏదో అక్కడ ఓ సినిమా చేశాం.. కల తీరింది.. అని మళ్లీ ఇక్కడికి వస్తే.. మన తెలుగు వాళ్లు ఎప్పుడూ ఆదరిస్తారు కాబట్టి ఓకే. అలా కాకుండా పొగరుతో... ఇలియానా చేసినట్టు చేస్తే.. ఉంది పోయింది..ఉంచుకున్నది పోయింది అన్నట్టు తయారవుతుంది పొజిషన్. మరి రకుల్ ఏం చేస్తుందో చూద్దాం...