English | Telugu

ఆమె ప్రేమలో రష్మిక మాజీ లవర్‌?

on Dec 13, 2019

టాలీవుడ్‌ ప్రజెంట్‌ టాప్‌ హీరోయిన్లలతో రష్మిక పేరు తప్పకుండా ఉంటుంది. తెలుగులో స్టార్‌డమ్‌ రాకముందు కన్నడ హీరో రక్షిత్‌ శెట్టితో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. తర్వాత అభిప్రాయభేదాలు రావడంతో బ్రేకప్‌ అయ్యారు. ఈ కథ అంతా మన తెలుగు ప్రేక్షకులకూ కాస్తో కూస్తో తెలుసు. తెలుగులో స్టార్‌డమ్‌ రావడంతో కన్నడ హీరోకు రష్మిక టాటా చెప్పేసిందని ఓ గుసగుస. ఇవన్నీ పక్కన పెడితే... ఆ కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి మరో హీరోయిన్‌తో తాజాగా ప్రేమలో పడ్డాడని టాక్‌.

తెలుగులో ‘రౌడీ’లో మంచు విష్ణు సరసన నటించిన శాన్వీ శ్రీవాస్తవ గుర్తుందా? ‘లవ్లీ’, ‘ప్యార్‌ మే పడిపోయానే’ సినిమాల్లో ఆది సాయికుమార్‌, ‘అడ్డా’లో సుశాంత్‌ పక్కన హీరోయిన్‌గా నటించింది. ఆమెతో రక్షిత్‌ శెట్టి ప్రేమలో పడ్డాడని శాండిల్‌వుడ్‌ సమాచారం. తెలుగు (‘అతడే శ్రీమన్నారాయణ’)తో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో  విడుదలవుతున్న కన్నడ సినిమా ‘అవనే శ్రీమన్నారామణ’లో రక్షిత్‌, శాన్వి జంటగా నటించారు. దాదాపుగా 200 రోజులు ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. రెండేళ్ళుగా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో రక్షిత్‌, శాన్వి మధ్య ప్రేమ చిగురించిందని టాక్‌. గత అనుభవం దృష్ట్యా ఈసారి ఎంగేజ్‌మెంట్‌ గట్రా ఏం లేకుండా డైరెక్ట్‌గా పెళ్లి చేసుకోవాలని రక్షిత్‌ డిసైడ్‌ అయ్యాడట.


Cinema Galleries



Latest News


Video-Gossips