సచిన్ కు రజనీ స్వీట్ మెసేజ్..
on Apr 19, 2017
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నటించిన ‘సచిన్: ఎబిలియన్ డ్రీమ్స్’ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ను చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ సచిన్ కు స్వీట్ మెసేజ్ ఇచ్చారు. ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్ చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. గ్లాడ్ బ్లెస్’ అని రజనీ ట్వీట్ చేశారు. ఇందుకు గాను సచిన్... ‘థ్యాంక్యూ తలైవా. తమిళ ట్రైలర్ కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా’ అంటూ ట్రైలర్ లింక్ షేర్ చేశాడు. కాగా సచిన్ నటించిన ‘సచిన్: ఎబిలియన్ డ్రీమ్స్’ మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి జేమ్స్ ఎర్స్కైన్ దర్శకత్వం వహిస్తుండగా...ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు.