అక్షయ్‌ని శంకర్ చంపేశాడు!
on Nov 9, 2018
అవును... అక్షయ్‌కుమార్‌ని శంకర్ చంపేశారు. అది రియల్ లైఫ్‌లో కాదులెండి... రీల్ లైఫ్‌లో! '2.ఓ' సినిమాలో! రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా '2.ఓ'. ఇందులో అక్షయ్ కుమార్ యాంటీ హీరోగా నటించారు. ఇప్పటివరకూ విడుదలైన టీజర్, ట్రైలర్, స్టిల్స్‌లో అక్షయ్ పక్షి రూపంలో కనిపించారు. అయితే.. అతడు క్రోమ్యాన్, బర్డ్ మ్యాన్ అని వచ్చిన వార్తలను దర్శకుడు శంకర్ ఖండించారు. సినిమాలో మానవేతర పాత్రలు కొన్ని వున్నాయని, అవేంటో సినిమా విడుదల తరవాత చూడమని చెప్పారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం సినిమాలో అక్షయ్ కుమార్ దుష్టశక్తిగా కనిపిస్తాడట! మొబైల్ రేడియేషన్ వలన మరణించిన ఓ వ్యక్తి దుష్టశక్తిగా మారి, మొబైల్స్ వాడకానికి కారణమైన వ్యక్తులపై, మొబైల్స్ వాడుతున్న వ్యక్తులపై ఎలా పగబట్టాడు? ఆ దుశశక్తిని చిట్టి రోబో ఎలా అడ్డుకుంది? అనేది సినిమా కథ అని టాక్. స్మార్ట్ ఫోన్స్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు పెద్ద సందేశం ఇవ్వాలని శంకర్ కథను సిద్ధం చేశారట. అమీ జాక్సన్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.