'పేట' లుక్ తో పేట్రేగిపోతున్న రజనీ ఫ్యాన్స్!!
on Sep 8, 2018
సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త సినిమా `పేట`. ఈచిత్రం మోషన్ పోస్టర్ తో పాటు టైటిల్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. ఈ మోషన్ పోస్టర్ చూసినవాళ్లంతా రజనీకాంత్ రానూ రానూ కుర్రాడైపోతున్నాడు అంటున్నారు. ఇక అభిమానులైతే పట్టలేని ఆనందంలో మునిగిపోయారు. ఇక ఈ చిత్రంలో రజనీ నైట్ మాఫియా డాన్ గా , డే టైమ్ లో హాస్టల్ వార్డెన్ గా ఇ లా టూ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో నటిస్తున్నాడనే సమాచారం అందుతోంది. ఇటీవల కబాలి, కాలా తర్వాత ఈ తరహా క్యారక్టర్ల పై రజనీకి బాగా ఇష్టం పెరిగిందట. అదే తరహాలో ఇప్పుడు `పేట` సినిమా చేస్తున్నాడు.
తన 68 ఏట కూడా అసలు జీన్స్ , టీ షర్ట్ వేసి కుర్రాడిలా పోజులిస్తున్నాడు రజనీ. నిజంగా యంగ్ హీరో స్ కూడా కుళ్లుకునేలా ఉందా మోషన్ పోస్టర్ అయితే. కార్తీక్ సుబ్బారాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కార్తిక్ సుబ్బారాజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా అనిపించే పాత్ర. వరుసగా కుర్ర దర్శకులకు అవకాశాలు ఇచ్చి ఫ్లాప్ లు తెచ్చుకుంటున్నాడన్న నెగిటివ్ న్యూస్ వస్తున్నా అవేమీ పట్టించుకోకుండా రజనీ మరో యంగ్ దర్శకుడికి అవకాశమిచ్చాడు. రంజిత్ లా కాకుండా రజనీకాంత్ నుంచి ఫ్యాన్స్ కోరుకుంటారో అలా సినిమా తీసి హిట్ కొడతానని కాన్ఫిడెన్స్ గా ఉన్నాడట దర్శకుడు కార్తిక్ సుబ్బారాజ్. చేతిలో కొవ్వుత్తుల స్టాండ్ తో చర్చిలో స్టైల్ గా నడిచొస్తున్న రజని గెటప్ ఆకట్టుకుంటోంది. కొంచెం ఓవర్ అనిపించినా అభిమానులు హ్యాపీ. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ యూరప్ లో జరుగుతోంది. అక్కడే నెల రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేసారట దర్శకుడు. అనిరుధ్ సంగీతం సమకూరస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.