'మా' ఎన్నికల్లో రాజేంద్రప్రసాదే గెలుపు
on Apr 17, 2015
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. తన ప్రత్యర్ధి జయసుధపై 53ఓట్ల ఆధిక్యంతో రాజేంద్రప్రసాద్ గెలుపొందారు. 'మా' అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకుగాను 392 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచే రాజేంద్రప్రసాద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 53ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రాజేంద్రప్రసాద్ విజయ౦ సాధించడంతో ఫిల్మ్ ఛా౦బర్ వద్ద ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
