రాజేంద్ర ప్రసాద్ విడుదల చేసిన 'పద్మశ్రీ' పోస్టర్స్
on Feb 23, 2021
ఎస్.ఎస్. పట్నాయక్ రచన చేస్తూ, దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'పద్మశ్రీ'. ఎస్.ఎస్. పిక్చర్స్ పతాకంపై సదాశివుని శిరీష నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీవీఎస్ రామ్మోహన్ రావు, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ సహ నిర్మాతలు. ఈ చిత్రంలోని హీరో హీరోయిన్ల లుక్ పోస్టర్లను ఇటీవల నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ... మా సినిమాలోని హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్‌లను నేను చిన్ననాటి నుండి ఎంతగానో అభిమానిస్తున్న నా అభిమాన హీరో, రోల్ మోడల్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతులమీదుగా ఆవిష్కరణ జరగటం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నేను సంపాదించుకున్న ఒక గ్రేట్ ఎచీవ్మెంట్ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, నన్ను రోల్ మోడల్ గా చేసుకున్న నా అభిమానులు ఇలా నటుడిగా, దర్శకుడిగా మారటం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే గౌరవప్రదమైన పేరు పెట్టి గౌరవప్రదంగా తీసిన ఈ పద్మశ్రీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అలా జరిగితే నాకు ఇంకా ఎంతో గౌరవంగా ఉంటుంది అని చెబుతూ పద్మశ్రీ చిత్ర యూనిట్ సభ్యులందరికీ తన ఆశీస్సులు అందించారు.
డాట్ యానిమేషన్ అందించిన గ్రాఫిక్స్ తో పాటు కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హర్రర్ మూవీగా రూపుదిద్దుకున్న పద్మశ్రీ మూవీ ప్రస్తుతం సెన్సార్ దశలో ఉంది. 'పద్మశ్రీ' షూటింగ్లో కొంత భాగాన్ని హైదరాబాద్, ఆలంపూర్లో జరపగా, అత్యధిక భాగం తృప్తి రిసార్ట్స్‌లోని అందమైన ప్రదేశాల్లో జరిపారు. అంతా కొత్తవారితో రూపొందిస్తోన్న ఈ మూవీకి తృప్తి రిస్టార్ట్స్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఎస్సెట్ అవుతాయని డైరెక్టర్ పట్నాయక్ చెప్పారు.
తారాగణం:
హీరోలు: పక్కి కిషోర్, ఎస్.ఎస్. పట్నాయక్, అల్లెన్ హర్ష, చక్రవర్తి
హీరోయిన్లు: కనికా ఖన్నా, రావులపల్లి సంధ్యారాణి, రమ్య, మాధురి
క్యారెక్టర్ ఆర్టిస్ట్స్: జ్యోతి, సతీష్ మరుపల్లి, డాక్టర్ ప్రవీణ్, కాళీ చరణ్, ఫన్నీ రాజు, పూజారి లక్ష్మణరావు, ఏ.వి.రమణ మూర్తి, కరుణాకర్, పూడి తిరుపతిరావు, జయశ్రీ.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: ఎస్.ఎస్. పట్నాయక్, ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, ఎడిటింగ్: కంబాల శ్రీనివాసరావు, విజువల్ ఎఫెక్ట్స్: విక్రం విలాసాగర్, ఆర్ట్: మణిపాత్రుని నాగేశ్వరరావు, ఫైట్స్: దేవరాజు మాస్టర్, సంగీతం: జాన్ పోట్ల, డాన్స్: వెంకట్, తారక్, లిరిక్స్: బాసంగి సురేష్ కుమార్, డబ్బీరు గోవిందరావు, మెండెం శ్రీధర్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్: పక్కి సురేష్, హారిక కృష్ణ!